బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్టు చేయాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్టు చేయాలి
  • కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్టు చేయాలని రాష్ట్ర పోలీసులను కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కోరారు. వాళ్లు ప్రజా సమస్యలపై పోరాటం చేయరని తెలిపారు. కానీ డ్రగ్స్ విషయానికి వస్తే అంతా ఒక్కటై డ్రగ్స్ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్ బయటపడ్డ ప్రతిసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్లకు సిగ్గు ఉంటే వెంటనే డ్రగ్స్ టెస్టు చేయించుకొని తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.  రాజ్ పాకాల, మద్దూరి విజయ్ లను వెనకేసుకురావడానికి కేటీఆర్ కు సిగ్గుండాలని మండిపడ్డారు. మద్దూరి విజయ్ కేటీఆర్ కు బినామీ అని తెలిపారు. రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు మద్దూరి విజయ్ ఒప్పుకున్నాడని, ఇప్పుడేమో ఆ స్టేట్ మెంట్‌ ను మారుస్తున్నారని ఆరోపించారు.